అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో జరిగే కుళ్లాయస్వామి మొహర్రం వేడుకలకు భక్తులు ఎవరూ రావద్దని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గ్రామంలోకి ఇతరులు ఎవరు రాకుండా గట్టి బందోబస్తు చేపడుతున్నారు. గ్రామంలో ప్రజలను కూడా దర్శనానికి అనుమతించమని ఎస్సై ఫణింద్ర రెడ్డి తెలిపారు.
11 రోజుల పాటు జరిగే కుళ్లాయస్వామి బ్రహ్మోత్సవాలకు స్వామికి చేయాల్సిన కార్యక్రమాలను అర్చకులు, సంబంధిత నిర్వాహకులు మాత్రమే పరిమిత సంఖ్యలో కొవిడ్ నిబంధనలు పాటిస్తు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిబంధనలు ఎవరైన అతిక్రమిస్తే కొవిడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గూగుడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఇతరులకు గూగుడు గ్రామంలోకి అనుమతి లేదన్నారు. గూగుడు గ్రామస్టుల ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు చూపిస్తేనే అనుమతిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
ఇదీ చదవండి: శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిపమాదం