రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్లో మాట్లాడిన ఆయన.. తెదేపా నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల గళం నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
ఇదీ చూడండి: