నవరాత్రుల సందర్భంగా.. అనంతపురం జిల్లా కదిరిలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకారంలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమిచ్చారు. కుమ్మరవాండ్ల పల్లిలోని మల్లాలమ్మ గుడిలో అన్నపూర్ణదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. ధర్మవరంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అలంకారంలో గాంధీనగర్ చౌడేశ్వరి అమ్మవారు ఆకట్టుకున్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. భౌతిక దూరం పాటించే విధంగా ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు గుంపులు కూడకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: