-
अब दूसरी किसान रेल चलने से आंध्रप्रदेश से दिल्ली तक रास्ते के सभी राज्यों के किसानों को भी इसका लाभ होगा...#KisanRail pic.twitter.com/GTRVmhcPPz
— Narendra Singh Tomar (@nstomar) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">अब दूसरी किसान रेल चलने से आंध्रप्रदेश से दिल्ली तक रास्ते के सभी राज्यों के किसानों को भी इसका लाभ होगा...#KisanRail pic.twitter.com/GTRVmhcPPz
— Narendra Singh Tomar (@nstomar) September 9, 2020अब दूसरी किसान रेल चलने से आंध्रप्रदेश से दिल्ली तक रास्ते के सभी राज्यों के किसानों को भी इसका लाभ होगा...#KisanRail pic.twitter.com/GTRVmhcPPz
— Narendra Singh Tomar (@nstomar) September 9, 2020
-
అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభోత్సవం. తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ pic.twitter.com/Mb4niSoWOc
">అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభోత్సవం. తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 9, 2020
ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ pic.twitter.com/Mb4niSoWOcఅనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభోత్సవం. తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, కేంద్రమంత్రులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 9, 2020
ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ pic.twitter.com/Mb4niSoWOc
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండో కిసాన్ రైలు పట్టాలెక్కింది. 2020-21 కేంద్ర బడ్జెట్ లో కిసాన్ రైళ్లను ప్రవేశపెడతామని తెలిపిన కేంద్రం.. ఆగస్టు 7న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పాట్నాకు తొలి కిసాన్ రైలు ప్రారంభించింది. రెండో కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశ రాజధాని దిల్లీకి ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా నుంచి న్యూఢిల్లీ మధ్య ఏర్పాటు చేసిన రెండో కిసాన్ రైలు ఇవాళ ప్రారంభమైంది. దక్షిణ భారత దేశం నుంచి ప్రారంభమైన తొలి కిసాన్ రైలు ఇదే కావడం విశేషం. దిల్లీలో తన కార్యాలయం నుంచి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్.సి.అంగడి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాళ్యా , రైల్వే అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 322 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులతో కూడిన కిసాన్ రైలుకూత పెడుతూ పట్టాలపై ముందుగు సాగింది.
సంతోషంగా ఉంది....
తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాల్లోని వివిద రాష్ట్రాల మార్కెట్లకు పండ్లు, కూరగాయలు, సహా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. అక్కడ డిమాండ్ ను బట్టి ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల మీదుగా కిసాన్ రైలు దిల్లీ వెళ్తుందని.. మార్గ మధ్యలో రాష్ట్రాల రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఉద్యాన వన,వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా దిల్లీ సహా పలు రాష్ట్రాల మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కిసాన్ రైలుతో అనంతపురం జిల్లా నుంచి దిల్లీకి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చన్న ఆయన..దేశంలో రెండో కిసాన్ రైలు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
రైతులు ఉపయోగించుకోవాలి...
అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఉద్యానవన పంటలు పండిస్తున్నారని ,95 శాతం ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ .సి. అంగడి తెలిపారు. రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కిసాన్ రైళ్లను ప్రారంభిస్తుందని తెలిపారు. కిసాన్ రైలు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని,పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రైతులందరూ కిసాన్ రైలును ఉపయోగించుకోవాలని కోరారు.
కిసాన్ రైలు ఎంతో కీలకం : సీఎం జగన్
దక్షిణ భారతదేశానికి పండ్ల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రం ఉందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఉద్యానవన పంటలు పండిస్తున్నారని తెలిపారు.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో కిసాన్ రైలు ఎంతో కీలకం కానుందని అన్నారు. కిసాన్ రైలు ను ప్రారంభించిన ఈ రోజు గుర్తుండిపోతుందని అభిప్రాయ పడ్డారు. కరోనాతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు క్లిష్ట పరిస్ధితులు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో కిసాన్ రైలు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.కిసాన్ రైలు ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. .
అనంతపురం జిల్లాలో ఏటా 2.02 లక్షల హెక్టార్లలో 58.39 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు, కూరగాయలు సాగు చేస్తారు. వీటిలో 80 శాతంపైగా ఉత్తర భారతదేశానికే రోడ్డు మార్గం ద్వారా ఎగుమతి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని మార్కెట్కు చేరేసరికి ప్రయాణ సమయం ఎక్కువై 25 శాతం ఉత్పత్తులు చెడిపోయేవి. పండ్ల రంగులో మార్పులు వచ్చి సరైన గిట్టు బాటు ధర వచ్చేది కాదు. 2150 కిలోమీటర్ల లోని దిల్లీకి కేవలం 40 గంటల్లోనే చేరుకునేలా కిసాన్ రైలును పట్టాలెక్కించారు..దీనివల్ల రోడ్డు రవాణాతో పోల్చితే సరకు రవాణా ఖర్చు కూడా చౌకగా ఉంటుంది. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లబించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: