వివాహేతర సంబంధం కారణంగా ఒకరినొకరు వేట కొడవళ్లతో దాడి చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం దేవరపల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రథమ చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు డయల్ 100కు కాల్ చేయడం వల్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పామిడి సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి :