ETV Bharat / state

శ్మశానంలో ఇళ్ల పట్టాలు పంపిణీ.. హాజరుకాని లబ్ధిదారులు! - ఇళ్ల పట్టాల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఓబులదేవరచెరువులో మహిళల ఆందోళన

పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా.. కొన్నిచోట్ల ఆ పథకం అబాసుపాలవుతోంది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో.. లబ్ధిదారులకు శ్మశానాన్ని అంటగట్టాలని అధికారులు ప్రయత్నించారు. ఓబులదేవరచెరువులో డబ్బులు తీసుకుని అనర్హులకు స్థలాలు ఇస్తున్నారని మహిళలు వాగ్వాదానికి దిగారు.

housing plots issue
ఇళ్ల పట్టాల పంచాయితీ
author img

By

Published : Dec 29, 2020, 5:47 PM IST

అధికారుల తీరు కారణంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో శ్మశానవాటికకు కేటాయించిన స్థలంలో పట్టాలు అందజేతకు సిద్ధమయ్యారు. భూమి కొని పేదలకు స్థలాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. అధికారులు తమకు శ్మశానవాటికను అంటగడుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులెవరూ రాకపోగా.. సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఓబులదేవరచెరువులోనూ పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. 217 మంది లబ్ధిదారులకు స్థలాలు అందజేసేందుకు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సిద్ధమయ్యారు. వీఆర్వో ఆదినారాయణమ్మ డబ్బులు తీసుకొని అనర్హులకు పట్టాలను అందజేశారంటూ మహిళలు గొడవకు దిగారు. తమకు ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదో తహసీల్దార్ సమాధానం చెప్పాలంటూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కల్పించుకొని వారికి సర్దిచెప్పగా గొడవ సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశ్రుతి... విద్యుదాఘాతంతో ఒకరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.