ETV Bharat / state

ఈ-కర్షక్​లో ఉద్యాన పంటల నమోదు..ప్రక్రియ ప్రారంభం - ఈ-కర్షక్​లో ఉద్యాన పంటల నమోదు

రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యాన పంటల నమోదు ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వ్యవసాయ పంటలను మాత్రమే నమోదు చేస్తుండగా.. ఈ సారి ఖరీఫ్ నుంచి పండ్లు, పూలు, కూరగాయల పంటలను ఈ-కర్షక్ లో నమోదు చేయనున్నారు. నమోదు చేసుకున్న రైతుల పంటలను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.

ఈ-కర్షక్​లో ఉద్యాన పంటల నమోదు..ప్రక్రియ ప్రారంభం !

author img

By

Published : Jul 4, 2020, 5:35 PM IST

రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యాన పంటలను నమోదు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు వ్యవసాయ పంటలను మాత్రమే నమోదు చేస్తుండగా..ఈ సారి ఖరీఫ్ నుంచి పండ్లు, పూలు, కూరగాయల పంటలను ఈ-కర్షక్ లో నమోదు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీనిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో రెండు లక్షల రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉద్యాన పంటల హబ్​గా రాష్ట్రస్థాయిలో పేరుంది. ఆ జిల్లాలో మామిడి 53వేల హెక్టార్లలో సాగవుతుండగా, బత్తాయి 52 వేలు, అరటి 16 వేలు, దానిమ్మ 7,500, కూరగాయలు 35 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో కూరగాయల పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న లక్ష పది వేల మంది రైతులు తమ పంటలను ఖరీఫ్ నుంచి ఈ-కర్షక్ లో నమోదు చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభించటానికి అన్ని జిల్లాలకు ఆదేశాలు అందాయి. వ్యవసాయ పంటల మాదిరిగా ఖరీఫ్, రబీ సీజన్​లలో మాత్రమే నమోదు చేసుకోకుండా ఉద్యాన పంటలను ఏడాది పొడవునా నమోదు చేయాలని ఉద్యానశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలొచ్చాయి. ఉద్యాన పంటలను ఈ-కర్షక్​లో నమోదు చేసుకోవటం పట్ల ఆయా పంటలు సాగుచేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ-కర్షక్ ద్వారా వ్యవసాయ పంటలు సాగుచేసే రైతులతో సమానంగా ప్రయోజనాలు అందివ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.