అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్కు చెందిన ఓ హోంగార్డు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై విరుచుకుపడ్డాడు. తాను పోలీసునని, తనను టిక్కెట్టు అడగకూడదని దౌర్జన్యం చేశాడు. తోటి ప్రయాణికులు, పోలీసులు అడ్డుకున్నా.. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనను బస్సు డ్రైవర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇలాంటి వారి వల్ల పోలీసు ప్రతిష్ఠ దెబ్బ తింటుందని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: