ETV Bharat / state

Heavy Rain : అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న బస్సు..

author img

By

Published : Oct 22, 2021, 11:39 AM IST

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. ఫలితంగా.. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

heavy-rains-in-ananthapur-distric
జిల్లాలో భారీ వర్షాలు

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆత్మకూరు మండలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం శివారులోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ వాగు దాటుతుండగా అకస్మాత్తుగా ఆగిపోయింది.

జిల్లాలో భారీ వర్షాలు.

ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వాగునీటి మధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు భయపడి కేకలు వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంబదూరు, కుందుర్పి, సెట్టూరు మండలాల్లో కూడా భారీ వర్షం కురవడంతో చెక్ డ్యాములు నిండిపోయాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ధర్మవరంలోనూ భారీ వర్షం పడింది. పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. పట్టణ శివారులోని గుట్ట కింద పల్లి వద్ద ఉన్న పౌరసరఫరాల గోదాములోకి వర్షపు నీరు భారీగా చేరింది. బియ్యం తీసుకొచ్చిన లారీలు నీటిలో సగం వరకు మునిగాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం, కందిపప్పు, చక్కెర వర్షం నీటిలో కొంతమేర మునిగాయి. గోదాం వద్ద నీటిని తరలించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి : చేపలు పట్టేందుకు వెళ్లి.. వరద ఉధృతిలో చిక్కుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.