ఇటీవల కురిసిన వర్షాలతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బ్రహ్మసముద్రం, కంబదూరు మండలాల్లో అధిక వర్షపాతం కురవడంతో హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 ఏళ్ల తర్వాత జిల్లాలో పెద్ద చెరువులో సగానికిపైగా నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి చెరువు పూర్తిగా నిండిపోయి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. చెలిమే పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి నీరు చేరింది. గుండిగాని పల్లి సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. శెట్టూరు మండలం అయ్యగార్ల పల్లి గ్రామ శివార్లలో వాగులో పడి ఆవు చనిపోయింది.
అనంతపురంలో భారీవర్షాలు..రాకపోకలకు అంతరాయం - అనంతపురంలో భారీవర్షం
నాలుగు రోజులనుండి కురుస్తున్న భారీవర్షాలతో కళ్యాణదుర్గం నియోజక వర్గంలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇటీవల కురిసిన వర్షాలతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బ్రహ్మసముద్రం, కంబదూరు మండలాల్లో అధిక వర్షపాతం కురవడంతో హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 20 ఏళ్ల తర్వాత జిల్లాలో పెద్ద చెరువులో సగానికిపైగా నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి చెరువు పూర్తిగా నిండిపోయి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. చెలిమే పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి నీరు చేరింది. గుండిగాని పల్లి సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. శెట్టూరు మండలం అయ్యగార్ల పల్లి గ్రామ శివార్లలో వాగులో పడి ఆవు చనిపోయింది.
~~~~~~~~~~~~*
భారీ వర్షాలతో నిండిన పలు చెరువులు... రాకపోకలకు అంతరాయం...
-----------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో చేసిన వర్షాలకు పలు చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోగా పలు గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని బ్రహ్మసముద్రం కంబదూరు అన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 20 ఏళ్ల తర్వాత జిల్లాలో పెద్ద చెరువు అయినా చెరుకు సగానికిపైగా నీరు చేరింది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి చెరువు పూర్తిగా నిండిపోగా రోడ్డుపైన ప్రవహిస్తున్న నీటితో ఆ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెలిమే పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణ లోకి భారీగా నీరు చేరింది. గుండి గాని పల్లి సమీపంలో రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. శెట్టూరు మండలం అయ్యగార్ల పల్లి గ్రామ శివార్లలో ఖరీదయిన ఆవు పారుతున్న వాగులో పడి మృత్యువాత పడింది. బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, రాయదుర్గం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో హగరి నది పరవళ్లు తొక్కుతున్న టంతో ఈ నది ప్రవాహం ని చూడడానికి అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు రైతులు తరలివచ్చారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా