అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో..గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ప్రశాంతి నిలయంలో ప్రతి ఏటా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆనవాయితీగా నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:30 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో.. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేడుకలు ప్రారంభమయ్యాయి.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని.. సత్యసాయిబాబా మహాసమాధిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ప్రశాంతి నిలయం.. భక్తులతో ప్రత్యేకత సంతరించుకుంది. పౌర్ణమి సందర్భంగా ఇష్టదైవమైన సత్య సాయిబాబా మహా సమాధిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని.. గురు వందన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాయిని కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ గ్లోబల్ కౌన్సిల్ నూతన చైర్మన్గా.. చక్రవర్తి నూతన బాధ్యతలు స్వీకరించారు. సత్యసాయిబాబా తమకు బోధించిన మార్గంలో ముందుకు వెళ్తామని.. బాబా బోధనలు, చేపట్టిన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. బాబా సేనలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప జేసేందుకు శాయా శక్రులా కృషి చేస్తానని చక్రవర్తి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
CM Jagan wishes: రాష్ట్ర ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్