అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ లో నాసిరకం విత్తనాలను పంపిణీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టూరు మండలం ఖైరేవు గ్రామంలో పంపిణీ చేసిన వేరుశనగ కాయలు నాసిరకంగా ఉన్నాయన్నారు. విత్తనాల రంగులు వేరువేరుగా ఉన్నాయని గమనించిన రైతులు.. సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లారు.
కాసేపు ఉద్రిక్తత వాతావారణం నెలకొన్న కారణంగా.. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనకు వచ్చిన వారితో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. పూర్తి నాసిరకంగా ఉన్న వేరుశెనగ కాయలను మార్చి మంచివి ఇస్తామని కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు మల్లికార్జున.. రైతులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: