నివర్ తుపాను కారణంగా అనంతపురం జిల్లాలో వరి పంట అతలాకుతలమైంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి.. నీటిలో మునిగిపోవడం వల్ల అన్నదాతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లాలోని గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల మండలాల్లో తుపాను ప్రభావంతో పంట భారీగా దెబ్బతింది. తుపాను ప్రభావంతో మొత్తం పంట నేలపాలు అయ్యింది. వందల ఎకరాల్లో పంట నష్టపోవడం వల్ల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చిన ఇంతవరకూ స్పందించలేదని కర్షకులు వాపోతున్నారు.
3 ఎకరాల్లో వరి సాగు చేశాం. తుపాను కారణంగా మొత్తం నేలకొరిగింది. నీళ్లు నిలవడం వల్ల మొలకెత్తే పరిస్థితిలో ఉంది. రేపో మాపో కోత కోయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో.. పంట మొత్తం నాశనం అయింది. అప్పు చేసి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం పూర్తిగా నష్టోయాం. వెంటనే ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలి - బాధిత రైతు
ఇదీ చూడండి:
నెల్లూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి