ETV Bharat / state

రాజధాని రైతులకు మద్ధతుగా అనంత మాజీ ఎమ్మెల్యే మౌనదీక్ష

author img

By

Published : Jan 1, 2020, 5:35 PM IST

రాజధాని రైతులకు అండగా అనంత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మౌనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తెదేపా మాజీ కార్పోరేటర్లు పాల్గొన్నారు.

former MLA is silent support for the capital farmers
రాజధాని రైతులకు అండగా అనంత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మౌనదీక్ష

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మౌనదీక్ష నిర్వహిస్తున్నారు. రాజధాని మార్పుపై వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నూతన సంవత్సర సంబరాలు చేసుకోరాదన్న తెదేపా నిర్ణయానికి అనుగుణంగా ప్రభాకర్ చౌదరి దీక్షకు పూనుకున్నారు. అనంతపురంలోని రామనగర్ కాలనీలో ప్రభాకర్ చౌదరి... తన గృహం వద్ద వేదిక ఏర్పాటు చేసుకొని ఒక్కరోజు మౌనదీక్ష చేస్తున్నారు. ఆయనకు సంఘీభావం తెలుపుతూ.. తెదేపా మాజీ కార్పోరేటర్లు దీక్షలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని తెదేపా నేతలు ఆరోపించారు. రాజధాని విశాఖపట్నం తరలిస్తే అనంతపురం నుంచి వెళ్లే వారు 12 వందల కిలోమీటర్లు ప్రయాణించాలని... జగన్ ఈ విషయం గుర్తించుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలోనైనా భగవంతుడు ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ఇవ్వాలని... రాజధాని మార్పు నిర్ణయం వెనక్కు తీసుకునేలా చేయాలని మహిళలు అన్నారు.

ఇవీ చదవండి:

అమరావతిలో ముగ్గులు.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్న మహిళలు

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.