స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. ఈ నెల 15న ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రిలో కోడ్ ఉల్లఘించి ఈనెల 8న బట్టలు, చీరలు పంచినట్లు ఈసీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కోడ్ ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చేస్తామని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో జగన్ నెంబర్ వన్: నారా లోకేశ్