అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 198 మంది పారిశుద్ధ్య కార్మికులకు డీఎస్పీ శ్రీనివాసులు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. వీటితోపాటు సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు సబ్బులు, కొబ్బరి నూనె అందజేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు డీఎస్పీ అవగాహన కల్పించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులు అందిస్తున్న సేవలను డీఎస్పీ కొనియాడారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు