కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవ మరువలేనిదని అనంతపురం జిల్లా కమ్మసంఘం కార్యదర్శి సరిపూటి సూర్యనారాయణ అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థలోని 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నగరాన్ని శుభ్రం చేస్తూ నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయటానికి దాతలు ముందుకు రావటం అభినందనీయమని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'ఆటో'పై కరోనా దెబ్బ- ఏప్రిల్లో విక్రయాలు జీరో