ETV Bharat / state

పట్టణంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయండి

మడకశిర పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీహెచ్​పీఎస్ డిమాండ్ చేసింది. నిఘా కెమెరాలు పనిచేయకపోవటం వల్ల పలు ప్రమాదాల కారణమవుతున్న వాహనాల ఆచూకీ తెలియటంలేదని వారు తెలిపారు.

DHPS demanded that CCTV cameras be set up in Madakashira town.
మడకశిర పట్టణం
author img

By

Published : Aug 28, 2020, 10:37 AM IST

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి ఆనుకొని ఉన్న ఇనుప మెట్ల స్టాండ్​ను గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్టాండ్ పక్కకు వాలింది. దీన్ని గుర్తించిన డీహెచ్​పీఎస్ వ్యవస్థాపకుడు హనుమంతు, అతని సహచరులు జేసీబీతో తిరిగి దాన్ని యథాస్థానంలో నిలబెట్టారు. దీనికి కారకులైన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని పోలీసులకు, మున్సిపల్ కమిషనర్​కు వినతిపత్రం అందించారు.

పట్టణంలో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో గతంలో ప్రమాదాలకు కారణమైన వాహనాల ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని... ఇప్పుడు మహనీయుల విగ్రహాలకు ఇదే పరిస్థితి ఏర్పడిందని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాలు ఎల్లవేళలా పనిచేసేలా చొరవ చూపి... గురువారం జరిగిన ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీహెచ్​పీఎస్ వ్యవస్థాపకుడు హనుమంతు కోరారు.

ఇదీ చదవండి: రాజధాని రైతుల పిటిషన్​పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.