వర్షాలతో నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయబద్ధంగా వినతి పత్రం ఇస్తామంటే అడ్డుకోవటం ఏమిటని సీపీఎం నేతలు ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసినవారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: