ప్రభుత్వం రైతులకు వన్ బీ ఫారం ద్వారా వేరుశనగ విత్తనాలు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో రైతులు 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. నాలుగు లక్షల క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలు సేకరించాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు మాత్రం రెండు లక్షల క్వింటాళ్లు మాత్రమే సేకరించారని తెలిపారు. వెంటనే మిగతా వాటిని సేకరించి రైతులకు అందించడానికి సిద్ధం చేయాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అనంతలో భారీ వర్షం.. పిడుగుపడి గుడిసె దగ్ధం, గొర్రెలు, కోళ్లు సజీవదహనం