అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని నక్కలగుట్ట కాలనీలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించిన అధికారులు స్థలం చూపించక పోవడంతో.. రెండు రోజులుగా వామ పక్షాల ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు సీపీఎం నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులు నక్కలగుట్ట సమీపంలో పునాదులు తవ్వడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ కుమార్, సోమందేపల్లి ఎస్సై వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ చెప్పారు. వారు వాగ్వాదానికి దిగడంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి