అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్లి గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అనంతపురం ఆసుపత్రికి తరలించి.. ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. రాకపోకలను కట్టడి చేశారు. రైతులు పొలంలో దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించారు.
వైద్యులు గ్రామస్థులకు థర్మల్ స్కానర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించారు. వృద్ధులకు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కోవిడ్ పట్ల అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి: కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ