ETV Bharat / state

అధిక వర్షాలకు అరటి పంటకు తీవ్ర నష్టం

author img

By

Published : Nov 25, 2020, 4:07 PM IST

భారీ వర్షాలు అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరిగ్గా చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు రావడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వాననీరు పొలాల్లోకి చేరడంతో..పంటలన్నీ పాడయ్యాయి.

Banana crop damaged by heavy rains at uravakonda
అధిక వర్షాలకు పాడైపోయిన అరటిపంట

ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉద్యాన పంట రైతులు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. . అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వర్షపు నీరు పంట పొలాల్లో అధికంగా ఉండడంతో అరటి, మిరప, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అహర్నిశలు కష్టపడి పండించిన పంటలు... అకాల వర్షాలకు నేలరాలయాయని కర్షకులు వాపోయారు.

జిల్లాలోఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో అరటిపంటను సాగు చేశారు. పంట వేసిన కొన్ని నెలలకే జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురవడంతో వర్షపు నీరు పంట పొలాల్లో ఉండిపోయింది. మోటర్లు ద్వారా, దిగువకు గుంతలు తవ్వి బయటకు నీళ్లు వదిలిన కూడా లాభం లేకుండా పోయింది. భూమిలో నుంచి నీళ్లు ఉబికి వస్తుండటంతో పంట పాడైాంది. చేసేదేమిలేక జేసీబీ ద్వారా అరటి చెట్లను తొలగించారు.

అధిక వర్షాలకు పాడైపోయిన అరటిపంట

నాలుగు ఎకరాలకు కలిపి 5500 అరటి మొక్కలు నాటితే ...భారీ వర్షాల కారణంగా మొత్తం పంట దెబ్బతింది. అందువల్లే జేసీబీ సహాయంతో పంటను తొలగించాం

-రైతు మధుసూదన్‌ నాయుడు

వర్షాల కారణంగా ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారి నెట్టికంటయ్య తెలిపారు. అరటి చెట్ల మొదల్లో నీళ్లు ఉన్నప్పుడు... ఆ నీటిని బయటకు పంపి చెట్లకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా కొంత వరకు ప్రయోజనం ఉంటుందనన్నారు. అరటి పంట నష్టపోతే హెక్టారుకు రూ. 25వేల రూపాయల వరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. కొన్ని ఎరువులు, మందులు వాడడం వాళ్ల అరటి చెట్లు కుళ్లిపోకుండా ఉంటాయన్నారు.

ఇదీ చూడండి.

'హెచ్చరిక.. కాలువలో మొసళ్లు తిరుతున్నాయ్.. లోనికి దిగకండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.