అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్యాంపర్స్ సంస్థవారు చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లి పాల విశిష్ఠత, చిన్నారుల పట్ల తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్యాంపర్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, అరికట్టే సమస్యల గురించి తెలిపారు. కార్యక్రమానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవి, హెచ్ఓడీ మల్లేశ్వరి హాజరయ్యారు.
ఇది చూడండి: అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం