అనంతపురం జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన కొందరు భక్తులు.. ఉత్తరప్రదేశ్‌లో చిక్కుకుపోయారు. నెలన్నర నుంచి ఊరు కాని ఊరిలో ఇబ్బందులు పడుతున్నారు. సొంత ప్రాంతాలకు చేరుకోలేక సతమతమవుతున్నారు. యాడికి, పెద్దపప్పూరు మండలాల నుంచి గత నెల 12న కాశీ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లాక్ డౌన్ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్లో చిక్కుకుపోయారు. అక్కడి రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో అందరూ తలదాచుకుంటున్నారు.
నెలన్నరగా కుటుంబాలకు దూరంగా ఉంటున్న వీరికి... యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన ఆశలు రేపుతోంది. ఏపీ ప్రభుత్వం స్పందిస్తే వీరిని పంపటానికి చర్యలు తీసుకుంటామని ఆయన పత్రికాముఖంగా ప్రకటించారు. సదరు పత్రికా ప్రకటనను తమ బంధువులకు, నాయకులకు వాట్సాప్‌లో పంపుతూ... తమను స్వస్థలాలకు చేర్చేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు. తమలో ఎలాంటి రోగ లక్షణాలు లేవనీ.... ఏపీకి వచ్చాక క్వారంటైన్లో ఉండటానికి కూడా సిద్ధమేనని వారు తెలిపారు.
ఇవీ చదవండి: