ETV Bharat / state

Anantapur Road Accident : రెప్పపాటులో ఘోరం.. కలను కన్నీళ్లుగా మార్చిన రోడ్డు ప్రమాదం

author img

By

Published : Aug 10, 2023, 10:13 AM IST

Updated : Aug 10, 2023, 10:47 AM IST

Anantapur Road Accident : పేద కుటుంబంలో పుట్టిన అతడు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ అయ్యాడు. వివాహమై.. ఇద్దరు పిల్లలు కాగా.. ఇటీవలే కొత్తగా గృహప్రవేశం చేశారు. భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. పిల్లలను బాగా చదివించి గొప్పవాళ్లను చేయాలని దంపతులు కలలుగన్నారు. సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో.. ఊహించని రోడ్డు ప్రమాదం వారి కలలను కన్నీళ్లుగా మార్చింది.

Anantapur_Road_Accident
Anantapur_Road_Accident

Anantapur Road Accident అనంతపురం నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం పోలీస్ శాఖలో విషాదం నింపింది. నగరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కిరణ్ బుధవారం ఉదయం సోమలదొడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన భార్య అనిత తరిమెల గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆమెను సోమలదొడ్డి వద్ద డ్రాప్ చేసేందుకు బైక్ బయల్దేరాడు.. బైక్ జారి కింద పడగా.. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో కిరణ్ కుమార్ రెండు కాళ్లు పూర్తి నుజ్జు నుజ్జు అయ్యాయి. వెంటనే స్థానికులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి(Anantapur) తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా.. కిరణ్ మృతి చెందాడు. దీంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో కిరణ్ భార్య అనిత కూడా తీవ్రంగా గాయపడింది.

couple died in road accident : చికిత్స కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

Police Job నిరుపేద కుటుంబానికి చెందిన కిరణ్‌కుమార్‌ కూలీ పనులు చేసి తల్లిదండ్రులకు అండగా ఉంటూనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించి.. తాను ఇష్టపడిన యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమారులతో సంసారం సాఫీగా సాగిపోతున్న వారి జీవితాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. రక్తమోడుతున్న శరీరాలతో దంపతులిద్దరూ.. పిల్లలను తలచుకుని ఒకరినొకరు హత్తుకుని రోదించడం చూపరులను కంట తడి పెట్టించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ ప్రాణాలొదలగా.. ఆయన భార్య తీవ్ర గాయాలతో చికిత్స తీసుకుంటూ.. మృత్యువుతో పోరాడుతోంది.

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

APSP Constable 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికైన ఆత్మకూరుకు చెందిన కిరణ్‌కుమార్‌(42) ఐదేళ్లు గ్రే హౌండ్స్‌ (Gray Hounds)లో పని చేశాడు. 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా కన్వర్షన్‌ తీసుకుని అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంటుగా పని చేస్తుండగా.. వీరికి వారికి యశ్వంత్‌ నారాయణ, మణిదీప్‌ అనే కుమారులు ఉన్నారు. ఇటీవలే నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇల్లు కట్టుకున్నారు. కిరణ్‌కుమార్‌ రోజూ భార్యను బైక్​పై సోమలదొడ్డి క్రాస్‌ వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7.30 గంటలకు భార్యతో కలిసి ఇంటి నుంచి బయల్దేరగా.. నగర శివారులోని గోపాల్‌ దాబా సమీపంలో 44వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం వారి పైనుంచి వేగంగా దూసుకెళ్లడంతో కానిస్టేబుల్‌ (Constable) రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. భార్య అనితకు తల, ముఖానికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే అనిత అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా కిరణ్‌కుమార్‌ మృతిచెందాడు.

108 Ambulance మానవత్వం కనుమరుగవుతోంది అని చెప్పడానికి ఈ రోడ్డు ప్రమాదం ఉదాహరణగా నిలుస్తోంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న కానిస్టేబుల్‌ దంపతులను జనం గుమికూడి ఫొటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూశారే తప్ప కాపాడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవరూ దగ్గరికి రాలేదు సరి కదా.. కనీసం నీళ్లైనా ఇవ్వలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు ఓదార్చుకునే ప్రయత్నం చేస్తుండగా.. అక్కడున్న జనం 108కి ఫోన్‌ చేసి చూస్తూ ఉండిపోయారు. అంబులెన్స్‌ వచ్చే వరకైనా కనీస సపర్యలు చేయాలన్న ఆలోచన చేయకపోవడం సమ సమాజం సిగ్గుపడాల్సిన అంశం.

అటు అధికారులు, సహోద్యోగులతో సన్నిహిత సంబంధాలు నెరిపే కిరణ్ కుమార్.. ఇక లేడన్న సమాచారంతో పోలీసుశాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిపినా.. ఆయన మంచితనం, సేవాగుణం గురించి చెప్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.

Road Accident in Kadapa: విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన ఇద్దరు ఉద్యోగులు.. మృతుల్లో ఆర్టీవో..

Last Updated : Aug 10, 2023, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.