అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట గ్రామం వద్ద రాత్రి ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పుట్టపర్తి మండలం బత్తలపల్లి తాండకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాండకు చెందిన రమణ నాయక్, రాజేశ్ బైకుపై ధర్మవరం నుంచి కొత్తచెరువు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గుర్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రమణ నాయక్‌ను చికిత్స పొందుతూ మృతిచెందగా.. పోతలయ్య, రాజేశ్ నాయక్‌కు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:
రేషన్ కార్డుల తొలగింపు ప్రచారంలో వాస్తవం లేదు: మంత్రి కొడాలి