ETV Bharat / state

మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత - మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత

అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.40 లక్షలు విలువచేసే వెండి అభరణాలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక చెందిన వాహనంలో 82 కిలోల వెండిని గుర్తించారు. వాటికి తగిన ఆధారాలు చూపించని కారణంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను సంబంధిత అధికారులకు అప్పగిస్తామని మడకశిర సీఐ దేవానంద్ తెలిపారు.

82 kgs silver take over by police at anantapur
వెండి బ్యాగులను చూపిస్తున్న పోలీసులు
author img

By

Published : Jan 15, 2020, 4:53 PM IST

మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత

మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత

ఇదీ చూడండి:

అమ్మఒడి నగదు అప్పులోకి జమ... తల్లి ఆవేదన!

Intro:పోలీసుల తనిఖీల్లో 40 లక్షల విలువచేసే వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి.


Body:అనంతపురం జిల్లా మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవానంద్, సిబ్బందితో మడకశిర సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రంకు చెందిన వాహనంలో వెండి ఆభరణాలతో ఉన్న 8 బ్యాగులు పట్టుబడ్డాయి. వాహనం లోని వ్యక్తులు వెండి ఆభరణాలకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో వాటిని మడకశిర పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Conclusion:సిఐ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మడకశిర శివారు ప్రాంతంలోని వైబి హళ్ళి క్రాస్ వద్ద ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాహనంలో 8 బ్యాగులలో 82 కిలోల వెండి సుమారు 40 లక్షల విలువచేసే ఆభరణాలు లభ్యమయ్యాయి. వాహనం లోని వ్యక్తులు ఆభరణాలు కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో కేసు నమోదు చేయడం జరిగింది. వీటిని సంబంధిత అధికారులకు అప్పగిస్తాం అంటూ సిఐ తెలిపారు.


బైట్స్ : దేవానంద్, సిఐ, మడకశిర.



యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్. : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.