అనంతపురం జిల్లా మడకశిర మండలంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కృష్ణ మీనన్, అధికారి తిమ్మప్ప.. ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మోహిత్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణంలో అనుమతి లేకుండా నిల్వ ఉన్న 1,82,120 రూపాయల విలువ గల 190 బ్యాగుల కాంప్లెక్స్ ఎరువును సీజ్ చేశారు.
ఎరువులను అనుమతి లేకుండా అమ్మడం, అధిక ధరలకు విక్రయం, రికార్డు నిర్వహణ పాటించకపోవడం చట్టరీత్యా నేరమని వివరించారు. ఇలాంటి ఎరువుల దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: