- ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం
రాష్ట్రంలో అప్పుల భారం పెరుగుతోందని కేంద్రం నివేదించింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
- ఏపీని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: సీఎం జగన్
నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని, ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం కనిపించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలన్న ఆయన, సచివాలయాల మహిళా పోలీస్‌లను ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థంగా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు.
- సంక్రాంతికి 6400 ప్రత్యేక బస్సులు.. ఈసారి సాధారణ చార్జీలే: ఆర్టీసీ ఎండీ
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే ఉంటాయని తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు.
- ఆస్పత్రికి వెళ్లే దారిలో రోగికి మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్
రోగితో అంబులెన్స్ డ్రైవర్ మద్యం తాగిస్తున్న ఘటన ఒడిశా జగత్‌సింహ్‌పూర్ జిల్లాలో జరిగింది. రోడ్డు పక్క అంబులెన్స్ ఆపి డ్రైవర్, రోగి మద్యం తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తిర్టోల్ ప్రాంతంలోని కటక్ ప్యారడైజ్ రహదారిలో సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంబులెన్స్‌లో పడుకున్న రోగికి డ్రైవర్ మద్యం పోస్తున్న దృశ్యాలు వీడియోలో సృష్టంగా కనిపిస్తున్నాయి.
- ఐరన్ రాడ్డుతో స్టూడెంట్ను కొట్టి చంపిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా...
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయుడు రాడ్డుతో కొట్టి చంపాడు. అదేంటని అడిగందుకు బాలుడి తల్లిపైనా దాడికి యత్నించాడు.
- చారిత్రక 'జీవవైవిధ్య' ఒప్పందానికి పచ్చజెండా.. ఆ దేశాలకు భారీగా ఆర్థిక సాయం
జీవవైవిధ్య పరిరక్షణ దిశగా కీలక ముందడుగు పడింది. ఐరాస జీవవైవిధ్య సదస్సులో కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడే పేద దేశాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ లభించేలా ఒప్పందాన్ని రూపొందించారు.
- వ్యక్తిగత రుణమా.. హౌసింగ్ లోనా?.. ఏది ముందు తీర్చేయాలి?
ఆర్బీఐ రెపో రేటు పెంచడం వల్ల గృహరుణాల రేట్లు పెరగడం ప్రారంభించాయి. ఇప్పటికే అనేక బ్యాంకులు తమ రెపో ఆధారిత రుణాల రేట్లను సవరించాయి. దీంతో చాలామందికి రుణ వ్యవధి ఒక్కసారిగా మారిపోయింది. 20 ఏళ్లకు తీసుకున్న రుణం.. తీరేందుకు 27-28 ఏళ్లు పడుతోంది. అందుకే రుణగ్రహీతలు సాధ్యమైనంత వేగంగా ఇంటి రుణం తీర్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఇంటి రుణంతోపాటు, వాహన, వ్యక్తిగత రుణాలు ఉన్న వారు దేన్ని ముందు తీర్చాలనే సందేహంతో ఉన్నారు.
- సముద్ర గర్భంలో మెస్సీ కటౌట్.. అభిమానులందు కేరళ ఫ్యాన్స్ వేరయా!
ఫిఫా మహాసమరంలో అర్జెంటీనా జట్టు జగజ్జేతగా నిలిచింది. ఆ జట్టు సారథి లియోనల్ మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. అదే కోవలో కేరళ అభిమానలు మెస్సీ కటౌట్‌ను సముద్ర గర్భంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియో మీరూ చూసేయండి..
- విశాల్‌కు నిజంగానే పొగరుంది.. ఎదుటివారికి హాని చేసేలా ఉండకూడదు: మోహన్ బాబు
కానిస్టేబుల్ పాత్రలో విశాల్ నటించిన చిత్రం 'లాఠీ'. ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈమేరకు నిర్వహించిన ఈవెంట్‌కు ప్రముఖ నటుడు మోహన్‌బాబు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.