ETV Bharat / sports

గంభీర్‌తో నవీనుల్‌ హక్‌.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌.. కోహ్లీని ఉద్దేశించేనా?

author img

By

Published : May 7, 2023, 1:47 PM IST

లఖ్​నవూ ప్లేయర్ నవీనుల్, బెంగళూరు బ్యాటర్​ విరాట్​ మధ్య వైరం రోజురోజుకు ఎక్కువవుతోంది. నవీనుల్ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్ట్​ చూస్తుంటే వీరిద్దరి మధ్య వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఇంతకీ నవీనుల్ చేసిన పోస్ట్​లో ఏముందంటే..

virat naveen ul gambhir
virat naveen ul gambhir

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ ప్లేయర్​ నవీనుల్ హక్​ మధ్య ఇటీవలే జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య గొడవ జరిగి వారం రోజులు గడుస్తున్నా.. వివాదానికి మాత్రం తెర పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య వార్​ నడుస్తుందా అంటే.. ఔను అనే చెప్పాలి. తాజాగా నవీనుల్​ హక్​ ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్ట్​ మరిన్ని చర్చలకు తావిస్తోంది.

గౌతమ్​ గంభీర్​తో ఉన్న ఫొటోకు.. 'మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని అనుకుంటారో మీరూ అలానే ఉండాలి. మీతో ప్రజలు ఎలా మాట్లాడాలని అనుకుంటారో మీరూ అలానే మాట్లాడాలి' అంటూ కామెంట్​ జత చేసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడు నవీనుల్. అతడు చేసిన ఈ పోస్ట్​కు లఖ్​నవూ మెంటార్ గంభీర్ కూడా స్పందించాడు. 'నువ్వు నీలానే ఉండు.. ఎప్పటికీ మారొద్దు' అని కామెంట్​ సెక్షన్​లో రాసుకొచ్చాడు. గంభీర్​ కామెంట్​తో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే శనివారం బెంగళూరు, దిల్లీతో మ్యాచ్​ ఓడిన అనంతరం నవీనుల్ ఈ పోస్ట్​ చేయటం వివాదాస్పదమైంది.

అసలేం జరిగిందంటే?
ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా గత సోమవారం లఖ్​నవూ సూపర్​ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ఈ లో స్కోరింగ్​ మ్యాచ్​లో ​బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్​ జరుగుతున్న సమయంలో విరాట్​, నవీనుల్​ మధ్య.. మ్యాచ్​ అనంతరం విరాట్​, గంభీర్​ మధ్య వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధానికి పలువురు సీనియర్లు సైతం స్పందించారు. క్రీడా స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం అని వారి అభిప్రాయాలు వెల్లడించారు. వీరి వివాదంపై ఐపీఎల్​ నిర్వాహకులు విరాట్​ సహా నవీనుల్​, గంభీర్​లకు క్రీడా నింబంధనలు ఉల్లంఘించారంటూ జరిమానా​ విధించింది.

బీసీసీఐకి విరాట్​ లేఖ..
వీరి వివాదం కారణంగా మ్యాచ్​ రిఫరీ విరాట్​ కోహ్లీ, గంభీర్​కు మ్యాచ్​ ఫీజులో వంద శాతం, నవీనుల్​కు 50 శాతం ఫైన్​ విధించారు. అయితే ఈ జరిమానాను కోహ్లీ తరఫున ఆర్​సీబీ యాజమాన్యం చెల్లించింది. ఈ విషయంపై విరాట్ కోహ్లీ​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐకు లేఖ రాశాడు. వంద శాతం జరిమానా విధించే అంత పెద్ద తప్పు తానేమీ చేయలేదంటూ వివరణ ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.