
సువిశాలమైన భూమిని.. సుందరమైన ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటాలని ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్(green india challenge). ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలనే ఈ స్వచ్ఛ సవాల్.. ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తోంది. చేయిపట్టి మరీ మొక్కలు నాటిస్తోంది. ఈ కార్యక్రమంలో సినీ లోకం బాధ్యతగా పాల్గొంటూ.. తమ అభిమానులు స్వచ్ఛ బాటలో నడిచేలా ఉత్సాహపరుస్తోంది. తాజాగా ఈ వరుసలో 'మేడమ్' కూడా చేరారు.

ఉద్యమంగా, ఉద్ధృతంగా ముందుకు సాగుతున్న 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో.. బుట్టబొమ్మ పూజాహెగ్డే(actress pooja hegde) పాలుపంచుకుంది. హీరో సుషాంత్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ముద్దుగుమ్మ.. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. తాను నాటిన మొక్కతో సెల్ఫీలు తీసుకుని మురిసిపోయింది. అనంతరం, బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్‌కుమార్, రితేష్దేశ్ముఖ్కి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది మేడమ్.
అందరూ మొక్కలు నాటండి..
"గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ని అరికట్టడానికి దోహదపడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి కాలుష్యం నుంచి బయటపడి స్వచ్ఛంగా ఉండేందుకు.. మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకునేందుకు ఎంతో సాయం చేస్తుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని.. నాటిన వాటిని జాగ్రత్తగా కాపాడాలని కోరుకుంటున్నా." - పూజాహెగ్జే, హీరోయిన్
అపూర్వ స్పందన..
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అన్ని భాషల నటులు ఈ సవాలును స్వీకరిస్తూ.. మొక్కలు నాటుతున్నారు. అందులో ముఖ్యంకా టాలీవుడ్ నటులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటూ.. కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, బిగ్‌బీ అమితాబ్ నుంచి మొదలు ఇప్పుడు పూజాహెగ్డే వరకు అందరూ.. ఛాలెంజ్‌ను స్వీకరించటమే కాకుండా.. తమ అభిమానులకు స్వచ్ఛ సందేశం ఇస్తున్నారు.
ఇవీ చూడండి:
Green India Challenge: కేబీఆర్ పార్క్‌లో మొక్కలు నాటిన దుల్కర్ సల్మాన్
Green India Challenge: రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి