LIVE: '90's మిడిల్ క్లాస్ బయోపిక్ సక్సెస్ మీట్ - ప్రత్యక్ష ప్రసారం - 90S webseries success meet live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 4:54 PM IST
|Updated : Jan 19, 2024, 5:52 PM IST
90'S A Middle Class Biopic Success Meet : తెలుగు లేటెస్ట్ వెబ్ సిరీస్ '90's ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్' ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తున్న ఈ సిరీస్ బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ (Sivaji), వాసుకీ ఆనంద్(Vasuki Anand), మౌళి, వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ '#90's: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. ఎమోషన్స్, కామెడీ, 90ల్లో జనరేషన్ మధ్య తరగతి పిల్లలు, తల్లిడండ్రుల పరిస్థితులను ఈ వెబ్ సిరీల్లో అద్భుతంగా చూపించారు. దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ వెబ్ సిరీస్‌ను ఆరు ఎపిసోడ్లతో రూపొందించారు. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కాగా, అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతున్న ఈ వెబ్‌సిరీస్ తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది ఈటీవీ.