శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బోద్దాం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాజాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే...
బోద్దాం గ్రామంలో ఐపీఎల్ మ్యాచ్‌ల క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం రావడంతో... రాజాం టౌన్ సీఐ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న బస్ షెల్టర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. వీరు బుధవారం రాత్రి కొల్కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెట్టింగ్‌కు పాల్పడ్డారు. వీరు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన నగదును పంచుకుంటుండగా... ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి రెండు లక్షల మూడు వేల నగదు, ఆరు చరవాణిలు, క్రికెట్ మ్యాచ్ స్కోర్ వివరాలు నమోదు చేసిన నోట్ బుక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ముద్దాయిలను కోర్టుకు పంపుతున్నట్లు... మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు రాజాం టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: నకిలీ కరెన్సీకి ఆశపడితే కత్తులతో బెదిరించి దోచేశారు!
.