విశాఖ జిల్లా ముంచంగివుట్ ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే జన్మించిన చిన్నారి మృతి చెందింది. దోడిపుట్టు గ్రామానికి చెందిన రుక్మిణి పురిటి నొప్పులుతో బాధపడుతుండటంతో లబ్బుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ పరిస్థితి మెరుగు పడకపోవడంతో ముంచంగివుట్ ఆసుపత్రికి తరలించారు. రుక్మిణికి మగ బిడ్డ జన్మించగా...కొద్దిసేపటికే పసికందు మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు ఆసుపత్రికి చేరుకొని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని, దీని పై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి..శోకసంద్రంలో కుటుంబీకులు - అప్పుడే పుట్టిన శిశువు మృతి
అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా ముంచంగివుట్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని, దీని పై సమగ్ర విచారణ జరిపించాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.