శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చెన్నాపురం గ్రామంలో బుధవారం రాత్రి గుట్కా ఖైనీ ప్యాకెట్లను నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బృందం గ్రామంలో తనిఖీలు నిర్వహించింది.
ఖైనీ, గుట్కా పట్టివేత..
అనంతరం గ్రామానికి చెందిన వడ్డీ తేజేశ్వరరావు నుంచి 96,580 రూపాయలు విలువగల ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ మేరకు తేజేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.