ETV Bharat / jagte-raho

సెల్ఫీ వీడియో తీసుకుని.. గృహిణి ఆత్మహత్య - లాలాపేట ఉరివేసుకున్న మహిళ

కళ్ల ముందే తల్లి ఉరివేసుకుంది. పిల్లలు... తమ తల్లిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... కాపాడుకోలేకపోయిన ఆ పిల్లల బాధ వర్ణాణాతీతం. వారి రోదనలు ఆపతరం ఎవరి వల్ల కాలేదు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లాలాగూడ పరిధిలో జరిగింది.

https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/visakhapatnam/cid-cyber-wing-rides-in-various-main-cities-in-ap-on-hi-tech-prostitution-through-online/ap20201206155601178

author img

By

Published : Dec 6, 2020, 8:05 PM IST

సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్‌ లాలాగూడాలో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆఖరు నిమిషంలో చూసిన చిన్నారులు... తల్లిని కాపాడేయత్నం చేశారు. కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... ఆ పిల్లలు కాపాడలేకపోయారు. ఇంటికి కొద్ది దూరంలోని దుకాణంలో ఉన్న తండ్రికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. తండ్రి వచ్చేలోగా తల్లి మృతి చెందింది.

మృతురాలు మంజుల... లాలాగూడా పరిధి లాలాపేట్‌ నివాసి. ఆమెకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు తేజస్, రంజిత్ ఉన్నారు. విగతజీవిగా పడి ఉన్న తల్లిని చూసి... అమ్మా... అమ్మా అంటూ ఆ పిల్లలు రోదించిన తీరు... స్థానికులను కంటతడి పెట్టించింది. మంజుల భర్త... లాలాపేట్ ప్రధాన రహదారిపై అయ్యంగార్ బేకరీ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

హైటెక్ వ్యభిచారంపై రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.