ETV Bharat / crime

cheating: కష్టార్జితాన్ని కొల్లగొట్టేస్తారు.. స్వల్ప వ్యవధిలో అధిక లాభాలంటూ మోసాలు

మీ పెట్టుబడి నెలల్లోనే రెట్టింపు చేసేస్తామంటారు. తమ దగ్గర డిపాజిట్టు చేస్తే మార్కెట్లో ఎక్కడా ఇవ్వనంత వడ్డీ ఇస్తామంటారు. ఏజెంటుగా చేరి మరికొందర్ని చేర్పిస్తే కమీషన్‌ వస్తుందని ఆశ చూపిస్తారు. మీ డబ్బు షేర్‌ మార్కెట్లో పెట్టి, తక్కువ రోజుల్లోనే ఎక్కువ లాభాలు తెప్పిస్తామంటారు. పేరు, తీరుల్లో కాస్త మార్పు ఉండవచ్చేమో గానీ.. పేద, మధ్య తరగతి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి లక్ష్యం. పొదుపు, మదుపు చేసుకోవాలనే జనాల ఆలోచనే వారి మోసానికి పెట్టుబడి. ఏపీలో జరుగుతున్న ఇలాంటి మోసాల్లో లక్షల మంది బాధితులవుతున్నారు.

money cheating
money cheating
author img

By

Published : Dec 19, 2021, 8:32 AM IST

‘మా సంస్థలో ఏజెంటుగా చేరండి. మీ కింద మరికొందర్ని చేర్చండి. వాళ్ల పరిధిలో ఇంకొందర్ని చేర్చుకోమని చెప్పండి. ఇలా మీ బృందాన్ని విస్తరించుకుంటూ వెళ్తే.. వారు చేసే మొత్తం వ్యాపారంపై మీకు ఇబ్బడిముబ్బడిగా కమీషన్‌ వస్తుంది. కొద్ది రోజుల్లోనే రూ.కోట్లు కళ్ల చూడొచ్చు’ అంటూ కొన్ని మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఉచ్చులోకి లాగుతాయి. కొన్ని సంస్థలేమో ఉత్పత్తుల విక్రయాల పేరిట, మరికొన్ని డిపాజిట్ల సేకరణకు ఈ పద్ధతి అనుసరిస్తున్నాయి. లావాదేవీల విలువ వందల కోట్లకు చేరుకునేసరికి ఏజెంట్లను, వారిని నమ్మి డబ్బులు కట్టిన జనాల్ని నట్టేట ముంచేస్తాయి. ఇలాంటి సంస్థలు ఇప్పుడు మొబైల్‌ యాప్స్‌ ద్వారా గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతుండటం కొత్త పోకడ.

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌

.

* నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన హెన్లీ ఇంటర్‌డినోమినల్‌ మిషన్‌ (హిమ్‌) ట్రస్టు రూ.70 కోట్ల మేర మోసానికి పాల్పడింది. రూ.10,500 చెల్లించి తమ సంస్థలో సభ్యుడిగా చేరితే నెలకు రూ.2,700 చొప్పున రెండు నెలలు, నెలకు రూ.5,400 చొప్పున ఆ తర్వాత తొమ్మిది నెలలు చెల్లిస్తామంటూ మోసానికి తెరలేపింది.

పెట్టుబడి పేరిట బురిడీ

.

‘మీ పెట్టుబడి నెలల్లోనే రెట్టింపు కావాలనుకుంటున్నారా? మా సంస్థలో డిపాజిట్టు చేయండి’ అంటూ వల విసురుతారు. ఎక్కడా లభించనంత వడ్డీ గిట్టుబాటవుతుందని ఆశ చూపిస్తారు. రెండు, మూడు నెలలు పక్కాగా చెల్లించేస్తారు. ఎక్కువ మంది డిపాజిట్లు చేశాక బోర్డు తిప్పేస్తారు.

* కర్నూలు జిల్లా ఆత్మకూరు కేంద్రంగా ఏర్పాటైన వర్ధన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు.. తమ దగ్గర డబ్బులు డిపాజిట్టు చేస్తే ఏడాదిలోనే రెట్టింపు చెల్లిస్తామని, 50 శాతం రాయితీపై వాహనాలు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆనక బోర్డు తిప్పేసింది. ‘మా సంస్థలో రూ.10 వేలు డిపాజిట్టు చేయండి. దానిపై వంద రోజులపాటు రోజుకు రూ.200 ఆదాయం పొందండి’ అంటూ నెల్లూరు జిల్లా వేదాయపాళెం కేంద్రంగా ఏర్పాటైన వెల్‌పే సంస్థ ఏడు నెలల్లో రూ.85 కోట్లు వసూలు చేసింది. 12 వేల మందిని మోసగించింది. ఈ రెండు సంస్థలపై కేసులు నమోదయ్యాయి.

చిట్టీలు కట్టించుకుని చెక్కేస్తున్నారు

.

‘ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాల్లో చిట్టీ కట్టుకోండి.. మీకు అవసరమైనప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం పొందొచ్చు’ అంటూ పరిచయస్తులు, స్నేహితుల ద్వారా డబ్బులు కట్టించుకుంటుంటారు. కొంతకాలం బాగానే చెల్లిస్తారు. చిట్టీల సంఖ్య పెరిగి, కొంచెం డబ్బు చేతికి అందగానే ఒక్కసారిగా ఉడాయిస్తుంటారు.

* విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన శుభదర్శి చిట్‌ఫండ్‌ ప్రజల నుంచి రూ.18 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిందని, పూజిత చిట్‌ఫండ్స్‌ డబ్బులు చెల్లించకుండా మోసం చేసిందని, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అరుణోదయ చిట్‌ఫండ్‌ రూ.11.70 కోట్లు వసూలు చేసి, 916 మందిని మోసగించిందని కేసులు నమోదయ్యాయి.

షేర్‌ మార్కెట్‌ పేరుతో..

.

‘షేర్‌మార్కెట్‌, ట్రేడింగ్‌లో మాకు అపార అనుభవం ఉంది. మా దగ్గర డబ్బులు పెడితే రోజుల్లోనే రెట్టింపు చేస్తాం’ అంటూ డబ్బులు దండుకుని, ఉడాయించేస్తున్న మోసాలు పెరిగాయి.

‘మా కంపెనీలో డిపాజిట్టు చేయండి. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతాం. లక్షకు నెలకు రూ.30 వేల చొప్పున మీకు చెల్లిస్తాం’ అంటూ రూ.300 కోట్ల మేర వసూలు చేసింది ఈ-బిడ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ. తర్వాత బోర్డు తిప్పేయడంతో అనంతపురం, కర్నూలు, కడప, మహారాష్ట్ర, కర్ణాటకల్లో బాధితులు ఘొల్లుమంటున్నారు. మీరు మా సంస్థలో డిపాజిట్టు చేస్తే ట్రేడింగ్‌ చేసి, అధిక వడ్డీ చెల్లిస్తామంటూ.. శ్రీకాకుళం జిల్లా రాజాం కేంద్రంగా ఏర్పాటైన ‘ఇండి ట్రేడ్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌’ 429 మంది నుంచి రూ.33.18 కోట్లు సేకరించి బిచాణా ఎత్తేసింది. ఈ సంస్థపైనా కేసు నమోదైంది.

ఆశకు పోతే.. అంతే

.

* గొలుసుకట్టు పథకాలు చట్టవిరుద్ధం. ఆశకు పోయి వీటిలో చేరితే ఆర్థికంగా నష్టపోవటమే కాదు.. కేసులూ ఎదుర్కోవాల్సి వస్తుంది.
* సభ్యుల్ని చేర్పిస్తే అదనపు కమీషన్‌ వస్తుందని మాటలు చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బాధితులకు జరిగే నష్టానికి ఆ స్కీముల్లో చేర్పించినవారు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
* తక్కువ రోజుల్లో రెట్టింపు సొమ్ము లేదా అసాధారణ వడ్డీ చెల్లిస్తామంటే అనుమానించాలి. బురిడీ సంస్థలు చెల్లిస్తామంటున్న స్థాయిలో వడ్డీ.. గుర్తింపు పొందిన, విశ్వసనీయత కలిగిన సంస్థలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయో గమనించాలి.
* గుర్తింపు పొందిన, అనుమతులున్న చిట్‌ఫండ్స్‌లో చేరితే పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదు. అనధికారిక చిట్స్‌ బారిన పడితే కష్టమే.
* ఏ సంస్థలోనైనా పొదుపు, మదుపు చేయాలనుకునే ముందు అనుమతులున్నాయా? లేదా? నిర్వాహకుల గత చరిత్రేంటి? ఆరా తీయాలి.

నేరాలు ఎక్కువ.. శిక్షలు తక్కువ

రాష్ట్రంలో ప్రతి లక్ష మందిలో 14.2 మంది ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు.

తరహా కేసుల్లో 2016లో ఏపీలో శిక్షల రేటు 10.7 శాతం. 2020 నాటికీ 11.2 శాతమే.

.

ఇదీ చదవండి: Loan App Case: చైనా రుణ యాప్​ల​ కేసులో కొత్తకోణం.. రూ.1400 కోట్లు విదేశాలకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.