తూర్పుగోదావరి జిల్లా కడియం మండలి మాధవవరాయుడుపాలెంలో దారుణం జరిగింది. గురువారం రాత్రి భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పద్మ(55), భర్త రాజారావు (69)గా పోలీసులు గుర్తించారు. భార్యను హతమార్చిన అనంతరం భర్త రాజారావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హత్య, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: CHITTOOR LAND SCAM: 2వేల 320 ఎకరాల భూములను కాజేసిన విశ్రాంత వీఆర్వో