హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భారీ క్రేన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆ వాహనం మూడు కార్లు, ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈ నెల 26న సాయంత్రం జరిగినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డైంది.
బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి... క్రేన్ డ్రైవర్ రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: