ETV Bharat / crime

పోలీసుల అదుపులో గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు.. సెటిల్​మెంట్​ చేస్తుండగా..! - Gangster Nayeem follower sheshanna

Gangster Nayeem follower sheshanna in Police Custody: గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో కొత్తపేటలోని ఓ రెస్టారెంట్​లో సెటిల్​మెంట్​ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు.

Gangster Nayeem follower sheshanna in Police Custody

author img

By

Published : Sep 27, 2022, 10:49 AM IST

Gangster Nayeem follower sheshanna in Police Custody: గ్యాంగ్​స్టర్​ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోని ఓ రెస్టారెంట్​లో సెటిల్​మెంట్​ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఓ పిస్తోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అచ్చంపేటకు చెందిన శేషన్న.. కొంతకాలం పీపుల్స్ వార్ గ్రూపులో పని చేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.

అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ.. బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాల వంటి అనేక కేసుల్లో నయీంతో పాటు శేషన్న కూడా నిందితుడుగా ఉన్నాడు. 2016లో షాద్​నగర్​లో జరిగిన ఎంకౌంటర్​లో నయీం మృతి చెందగా.. అప్పటి నుంచి శేషన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్నాళ్లకు సరైన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శేషన్నను పట్టుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.