CHAIN SNATCHERS: విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. స్టీల్ ప్లాంట్ సెక్టర్-5 బస్టాప్ వద్ద మహిళ మెడలో బంగారం దోచుకుంటుండగా అడ్డుకున్న డీజీఎంపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో స్టీల్ ప్లాంట్ డీజీఎం మనోహర్‌రెడ్డికి గాయాలయ్యాయి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో చైన్ స్నాచర్లలో ఒకరు పరారవ్వగా మరొకరిని కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారమందుకున్న పోలీసులు పట్టుబడిన చైన్ స్నాచర్ వద్ద నుంచి ఒక తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: