వీఎంఆర్‌డీఏ కార్యదర్శి జి.గణేష్‌కుమార్‌కు ఐఏఎస్ హోదా వచ్చింది. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్న ఆయన గతంలో గ్రూప్-1 అధికారిగా ఎంపికై శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. రంపచోడవం ఆర్డీవోగానూ విధులు నిర్వర్తించారు. కొద్ది రోజుల కిందట బదిలీపై వీఎంఆర్‌డీకు వచ్చారు.
రసాయన ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసిన గణేష్... 22 ఏళ్ల వయసులోనే ప్లాంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించారు. ఆ తరువాత పోటీ పరీక్షలకు సిద్ధమై ఒకేసారి గ్రూప్-1కి, ఐవోసీఎల్‌కు ఎంపికయ్యారు. ఆ సమయంలో గ్రూప్-1 అధికారిగా బాధ్యతలు తీసుకొని శ్రీకాకుళంలో శిక్షణ పూర్తి చేశారు. తాజాగా.. ఐఏఎస్ హోదా అందుకున్న ఆయన.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: