రెండేళ్ల కుమారునితో కలిసి.. ఓ తల్లి భవనంపై నుంచి దూకి మృతి చెందింది. విషాదకరమైన ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాకలో జరిగింది. చుక్కవానిపాలేనికి చెందిన జయంతి బెహరా.. ఆమె రెండేళ్ల కుమారుడు రోహిన్ బహెరా పుట్టిన రోజు వేడుక విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
మనస్థాపం చెందిన తల్లి.. కుమారునితో కలిసి నాలుగంతస్థుల భవనంపై నుంచి దూకింది. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కుమారుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: