విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు(Visakha Steel Conservation Movement 250 day)... ఇవాళ్టితో 250 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 250 మంది కార్మికులు 25 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. విశాఖ కూర్మన్నపాలెం జాతీయ రహదారి వద్ద కొనసాగుతున్న శిబిరంలోనే ఈ దీక్షలు నిర్వహించేలా ఏర్పాటుచేశారు. ప్రైవేటీకరణను ఆపేలా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడమే దీక్షల ఉద్దేశమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని 13 జిల్లాలకూ విస్తరించేలా ప్రయత్నాలు వేగవంతం చేశామని కార్మిక నేతలు తెలిపారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, యువతను పోరాటంలో భాగస్వాముల్ని చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు మరింత చొరవ చూపాలని కోరతామన్నారు. అలాగే 100 మంది ఎంపీలతో సంతకాలు సేకరించి ప్రధానమంత్రిని కలుస్తామంటున్నారు. ఇవాళ కార్మిక సంఘాలు చేపట్టే 25 గంటల దీక్షలకు రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు సంఘీభావం తెలపనున్నారు.
ఇదీ చదవండి..