ఈ నెల 14న జరగబోయే.. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా.. చందనం అరగదీతను ప్రారంభించారు. పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలను తీసి.. బేడా మండపం చుట్టూ తిరిగి చందన సాన దగ్గర విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం చందన సాన ముహూర్తాన్ని ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులు మొదలుపెట్టారు. ఐదు రోజులపాటు సుమారు 125 కిలోల గంధాన్ని అరగదీస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా