TDP Leader Palla Srinivas rao On Steel Plant Privatization: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు పోరాటం చేయటంలేదని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు నిలదీశారు.
ఉక్కు కార్మికుల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్న వైకాపా.. గన్నవరం పోర్టులో 10.24 శాతం రాష్ట్ర వాటాను అదానీకి ఎందుకు అమ్మేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ద్వంద వైఖరిని విడనాడి.. చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తెదేపా పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఇదీ చదవండి :
CJI NV Ramana: కష్ట కాలంలో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు - సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ