BANDARU ON YSRCP ILLEGAL MINING & LAND GRABBING: విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని.. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని తెదేపా నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కోరారు. సబ్బవరం మండలంలో స్వయంగా ఎమ్మెల్యే ఆదీప్ రాజా మేనమామ వీఆర్వోగా ఉండడంతో అధికార దర్పం ప్రదర్శిస్తున్నారన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు సైతం భూ కబ్జాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీకి చెందిన కొందరు సబ్బవరం, పెందుర్తిలో 36 ప్రభుత్వ భూములు అక్రమించుకున్నారని బండారు వివరించారు. సబ్బవరం, పెందుర్తి తహసీల్దార్లపై విచారణ జరిపి.. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సబ్బవరం మండలంలో గనులు అక్రమంగా తవ్వుకుంటున్నారని.. గొట్టివాడ, సబ్బవరం పరిసర గ్రామాల్లో రాత్రిపూట గనుల తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో అధికారులు సైతం ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖలో రాత్రులు మైన్స్ విభాగం అధికారులు ఫోన్లలో అందుబాటులో ఉండడం లేదని ఆక్షేపించారు. విజిలెన్స్ ఎస్పీ సైతం సంబంధం లేదని అంటున్నారని వెల్లడించారు. నిజాయతీగా ఉన్న గనుల శాఖాధికారి ప్రతాప్ రెడ్డిని ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
Report on Rudakota deaths: ‘రూఢకోట’ శిశుమరణాల వెనుక.. నివ్వెరపోయే నిజాలు..!