వరలక్ష్మీ దేవీ వ్రతం సందర్భంగా విశాఖ జిల్లాలో మార్కెట్లన్నీ కొనగోలుదారులతో రద్దీగా మారాయి. పూలు, పండ్ల దుకాణాలకు కిటకిటలాడాయి. లక్ష్మీదేవీ పూజలో కచ్చితంగా వాడే చామంతి ఒక్కో పువ్వునే పది రూపాయల ధర పలుకుతోంది. ఎలమంచలి పట్టణంలో మార్కెట్ అంతా కొనగోలుదారులతో సందడిగా మారటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. బంగారు ఆభరణాల దుకాణాలు, వస్త్ర దుకాణాల్లో శ్రావణం శోభ కనిపించింది.
ఇదీ చదవండి : సింహాచలం స్వామివారికి స్వాతి నక్షత్ర హోమం