Son died in Mother's Funeral: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా ఆమె కుమారుడు మృతి చెందిన ఘటన అందరినీ కలచి వేసింది. చౌడువాడకు చెందిన అచ్చియమ్మ వయసు 78ఏళ్లు. అనారోగ్యం కారణంగా ఆమె మరణించింది. తల్లి మరణం ఆమె కుమారుడు బలరాంను తీవ్రంగా కలచివేసింది. తల్లినే తలుచుకుంటూ కుమిలిపోతూ...అంతిమ సంస్కారాలు మొదలుపెట్టాడు. నవమాసాలు మోసి, కని పెంచిన అమ్మ ఇకలేదని.. ఇకపై రాదని అరవై ఏళ్ల బలరాం తట్టుకోలేకపోయాడు. తన వెన్నంటే నిలిచిన అమ్మ అంత్యక్రియల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు బలరాంను ఆసుపత్రికి తరలించారు. కానీ... ఆసుపత్రికి చేరేలేపే బలరాంనాయుడు తన తల్లిని చేరుకున్నారు. బలరాం గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. తల్లి మృతి చెందిన కొన్ని గంటల్లోనే కుమారుడు మృతి చెందడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి
ఇవీ చదవండి: